
దాడి కేసులో ఇద్దరు అరెస్టు
మార్కాపురం: ఇంటి స్థలాన్ని ఆక్రమించగా ప్రశ్నించిన మహిళపై దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు. పట్టణంలోని బాపూజీ కాలనీలో గోపాలుని లక్ష్మీభవానీ ఇంటి స్థలాన్ని షేక్ అబ్దుల్ రహమాన్, కందుకూరి శంకరాచారి ఆక్రమించారు. దీనిపై భవానీ వారిని ప్రశ్నించగా వారు ఆమైపె దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. నిందుతులు ఇద్దరిని సబ్‌జైల్‌కు తరలించినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు చెప్పారు.
ఒంగోలు వాసి సికింద్రాబాద్‌లో మృతి
ఒంగోలు టౌన్: ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీను అనే భవన నిర్మాణ కార్మికుడు సికింద్రా బాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తుర్కపల్లి పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ పనుల నిమిత్తం ఒంగోలు నుంచి భువనగిరి వచ్చిన శ్రీను అక్కడ నుంచి తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తండాకు వెళ్తున్న క్రమంలో పెద్ద తండా గ్రామ శివారు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీను మరణించాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియవు. మెడ మీద అమ్మ అని, కుడి చేతిమీద లవ్ సింబల్, స్టార్ పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి ఆచూకీ తెలిసినవారు 8712662479, 8712662805ను సంప్రదించాలని తుర్కపల్లి పోలీసులు కోరారు.