
బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఒంగోలు సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై, సినీ హీరో చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చిరంజీవి, జగన్ పట్ల బాలకృష్ణ అమర్యాదకరంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వారి గురించి మాట్లాడే అర్హత బాలకృష్ణకి లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తవుతున్నట్లు తెలిపారు. టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లటంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో అర్థంకానీ అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. మీరు మాట్లాడే భాషను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారనీ, భవిష్యత్ లో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
సభ్యసమాజం తలదించుకునేలా బాలకృష్ణ వ్యాఖ్యలు
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి
మార్కాపురం: అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సభలో బాలకృష్ణ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణకు లేదన్నారు. చిరంజీవి, చంద్రబాబుతో విభేదాలుంటే వారితోనే బాలకృష్ణ తేల్చుకోవాలే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. అసెంబ్లీలో సభ్యసమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడటం తగదని అన్నారు. ఇలా సభా మర్యాదలు పాటించకుండా మాట్లాడి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చూశాక ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా ఉందని అన్నారు. బాలకృష్ణ సొంత ఇంట్లో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని జంకె సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బాలకృష్ణ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
● పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చిరంజీవిపై, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చిరంజీవి అన్నా, మీరన్నా ఎంతో గౌరవం ఉండే వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. అటువంటి వ్యక్తిని సైకోగాడు అనడానికి మీకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మీకు మంత్రిపదవి రాలేదనే బాధతో లేదా పార్టీ చంద్రబాబునాయుడు చేతుల్లోకి పోయిందనే బాధల్లో జగన్‌మోహన్‌రెడ్డిని అలా మాట్లాడటం తగదని విమర్శించారు. ప్రతి ఒక్కరినీ ఉన్నతంగా గౌరవంగా సంబోధించే ఏకై క వ్యక్తి జగన్ అని కొనియాడారు. బాలకృష్ణ అన్న మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు

బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు