
పొంగిన వాగులు, వంకలు
జిల్లా అంతటా ఎడతెరపిలేని వర్షం పలుచోట్ల రాకపోకలు బంద్ మార్కాపురం మండలంలో కూలిన మట్టిమిద్దె
మార్కాపురం: మార్కాపురం ప్రాంతంలో శుక్రవారం వేకువజామున నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పారుతున్నాయి. మార్కాపురం, పెద్దారవీడు, యర్రగొండపాలెం, తర్లుపాడు, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో వర్షం కరుస్తోంది. మార్కాపురం ప్రాంతంలో 21.6 మి.మీ, యర్రగొండపాలెంలో 38.6, పుల్లలచెరువులో 45.4, పెద్దారవీడులో 8.4, దోర్నాలలో 4.8, త్రిపురాంతకంలో 22.6, కంభంలో 5.4, బేస్తవారిపేటలో 3.8, అర్ధవీడులో 8.6, గిద్దలూరులో 1.6, తర్లుపాడులో 8.4, రాచర్లలో 2.2 మి.మీ వర్షం కురిసింది. దీనితో మార్కాపురం–కుంట మధ్య ఉన్న చెరువువాగు, కుంట–జమ్మనపల్లి మధ్య ఉన్న ఉప్పువాగు, మార్కాపురం చెరువుకట్టపై ఉన్న అలుగు ప్రాంతాల్లో రోడ్డుపై వర్షపు నీరు పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు తన సిబ్బందితో వాగులు రోడ్డుపై పారుతున్న ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి ప్రమాదాలు జరగకుండా నివారించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోలభీమునిపాడు గ్రామంలో డోలు కిరణ్ మట్టిమిద్దె కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరికీ ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంట్లో ఉన్న బీరువా, ఇతర సామాన్లు రాళ్లుపడి ధ్వంసమయ్యాయి.

పొంగిన వాగులు, వంకలు

పొంగిన వాగులు, వంకలు