
ప్రతి విభాగంలో లక్ష్యాలు సాధించాలి
● బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని జిల్లా నూతన కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా నూతన కలెక్టర్‌గా శనివారం బా ధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత వివిధ శాఖల అధికారులను పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న ప్రాధాన్యతా కార్యక్రమాల వివరాలడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీగా ముందుకుసాగాలని హితవు పలికారు. నిజా యితీగా, బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని జవాబుదారీతనంతో అర్జీదారులకు సంతృప్తికరమైన పరష్కారం చూపాలని సూచించారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదని, ఆ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్రంగా పరిశీలన చేసి పరిష్కార మార్గాలు, సమస్య మూలాలు తెలుసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు అధికారులు వివరించారు. సమీక్ష సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో బి.చినఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్దన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గాలికుంటు వ్యాధిపై అవగాహన పెంచాలి
పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధిపై పశుపోషకుల్లో అవగాహన కల్పించాలని నూతన కలెక్టర్ రాజాబాబు సూచించారు. ప్రకాశం భవన్‌లోని తన చాంబర్‌లో పశుసంవర్థకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.రవికుమార్‌తో కలిసి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమ పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 6,02,250 డోసులు ఉచితంగా వేయనున్నట్లు డాక్టర్ బి.రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యులు డి.సురేంద్రప్రసాద్, పారా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.