
ప్రజల ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్ శాఖ
● మంచికలపాడును సందర్శించి బెల్టు షాపులు నిర్వహించకుండా చూస్తామన్న ఈఏఎస్ వెంకట్
చీమకుర్తి రూరల్: మండలంలోని మంచికలపాడు గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని, గ్రామంలో ఎక్కడా మద్యం విక్రయించకూడదని స్థానిక ప్రజలు శుక్రవారం ఆందోళన చేసి రెండు బెల్టు షాపులను ధ్వంసం చేయడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకట్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభీష్టం మేరకు మంచికలపాడులో బెల్టు షాపులు నిర్వహించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి పక్క గ్రామమైన బండ్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బెల్టు షాపుల వద్ద ఆకతాయిల ఆగడాల కారణంగా భయాందోళన చెందుతున్నారని తెలిపారు. పొలాలకు వెళ్లాలంటే మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అందువలన బెల్టు షాపులను మూసివేయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పెరికల నాగేశ్వరరావు, ఎంపీటీసీ అత్యాల అంకయ్య, మాజీ సర్పంచ్‌లు శేషమ్మ, శ్రీనివాసరావు, పొన్నపల్లి సుబ్బారావు, అత్యాల ఏసేపు, పొన్నపల్లి ఏడుకొండలు, కోరా సుబ్బారావు, పొన్నపల్లి శ్రీనివాసరావు, పొన్నపల్లి వెంకటరావు, ఉల్లి సుబ్బారావు, సాలువ సుబ్బారావు, చీమకుర్తి ఎకై ్సజ్ ఎస్‌ఐ నాగేష్, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.