
వాస్తవాలను దాచలేరు
పత్రికా స్వేచ్ఛ గురించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం బాగాలేదు. పాత్రికేయుల మీద తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు బనాయించడం సహేతుకం కాదు. ప్రభుత్వ విధానాల మీద ఎలాంటి వార్తలు రాయకూడదు, మాట్లాడకూడదు అంటే ఎలా? పాలకులు ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించాల్సిన బాధ్యత లేదా ? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో వాస్తవాలను దాచిపెట్టాలనుకోవడం కూడా అంతే అసాధ్యం. పత్రికలు ప్రజల గొంతు వినిపించడం సహజం. దానికి ఉలికిపడటం సమర్ధత అనిపించుకోదు.
– నగరికంటి శ్రీనివాసరావు, న్యాయవాది, ఒంగోలు బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ