
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై విచారణ చేయండి
ఒంగోలు సబర్బన్: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంపై భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టరేట్ గోపాల కృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రకాశం భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో బుధవారం కలిసిన డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్‌సీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంపికై న అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలన్నారు. డీఎస్‌సీ నోటిఫికేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైతే ఎంపికయ్యారో వివాహమైన మహిళ అయితే ఆమె భర్త ఇన్‌కమ్ సర్టిఫికెట్, పురుషులు అయితే వారి లేటెస్ట్ సర్టిఫికెట్స్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఎంపికై న వాళ్లలో కొంతమంది భూములు, పెళ్లిళ్లు అయిన తర్వాత భర్తలకు సొంత కంపెనీలు, ఆస్తులు ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ తెచ్చుకుని ఉద్యోగానికి ఎంపికయ్యారన్నారు. ఇటువంటి వారి సర్టిఫికెట్స్‌పై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారో అటువంటి వారిని అనర్హులను చేసి తొలగించాలన్నారు. అదేవిధంగా అటువంటి వారిపై క్రిమినల్ కేసులు, నమోదు చేయాలన్నారు. అర్హులైన వారికి టీచర్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై జేసీ గోపాల కృష్ణ స్పందించి ఫేక్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు పి.నరేంద్ర, పి.రాంబాబు, జీ శ్రీనివాసులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ సర్టిఫికెట్స్ ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి
జేసీకి వినతి పత్రం ఇచ్చిన డీవైఎఫ్‌ఐ నాయకులు