
పత్రికల మీద కేసులు తగవు
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏదైనా వార్తల విషయంలో నచ్చని అంశాలు ఉంటే వాటిని ఖండించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నష్టం కలిగించింది అనుకున్న సందర్భంలో న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇన్ని మార్గాలు ఉండగా అక్రమంగా కేసులు నమోదు చేయడం, పాత్రికేయులను అరెస్టు చేయడం సమర్థనీయం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చెడు సంప్రదాయానికి దారితీస్తాయి.
– బి.శ్రీనివాసరావు, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరమ్ కన్వీనర్