
బాబు పాలనలో రైతుల అగచాట్లు..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
కనిగిరిరూరల్: వైఎస్సార్ సీపీ రైతుకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైఎస్సార్ పాలనలో, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో రైతులను రాజుగా చూశారని.. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో రైతులకు కనీసం ఎరువులు అందించకుండా నానా అగచాట్లు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రైతన్నకు అండగా నిలిచేందుకు చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం మంగళవారం కనిగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులు కష్టాల్లో కూరుకుపోయారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల లేదని, బీమా లేదు, పంట నష్ట పరిహారం లేదు, ఎరువులు, కాంప్లెక్స్, యూరియా కొరత ఇలా అనేక ఇక్కట్లకు గురవుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అయినా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో అయినా రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. రైతుల కోసం అండగా నిలిచింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండి పోరాటం సాగిస్తోందన్నారు. రాష్ట్రంలో గతేడాది 40 లక్షల మెట్రిక్ టన్నులు, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయని తెలిపారు. కానీ ఏ ఈడాది 7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తగ్గించారన్నారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఏడాది 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉందని తెలిసి కూడా.. రాష్ట్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో విఫలమైందన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులను, డీఏపీలను సంవృద్ధిగా తెప్పించి ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.
కూటమి పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం: దద్దాల నారాయణయాదవ్
వైఎస్సార్ హాయంలో, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందని వైఎస్సార్‌సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. కూటమి సర్కార్‌లో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లేవని, రైతు భరోసా పథకాన్ని అరకొరకగా అందించి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు ఎరువుల కోసం పడి గాపులు కాస్తుంటే.. వ్యవసాయ శాఖ మంత్రి బఫే సిస్టమ్ లాగా వచ్చారంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. రైతులకు అన్ని రకాల ఎరువులను సంవృద్ధిగా అందించాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్ర ప్రజలు కూటమి సర్కార్ పై తీవ్రంగా మండిపడుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెచ్చేందుకు రైతులు, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు వినతి పత్రం అందజేశారు. తొలుత స్థానిక మున్సిపల్ చైర్మన్ గఫార్ ఇంటి వద్ద నుంచి, పామూరు బస్టాండ్ వరకు రైతులు, నాయకులు ర్యాలీగా వచ్చారు. అక్కడి నుంచి, పార్టీ నేతలు, రైతులు, రైతు నాయకులు, ప్రతినిధులు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు కసుకుర్తి ఆదెన్న, పీడీసీసీబీ మాజీ చైర్మన్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గఫార్, మడతల కస్తూరిరెడ్డి, గంగసాని లక్ష్మి హుస్సేన్‌రెడ్డి, గాయం సావిత్రి, పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, మూడమంచు వెంకటేశ్వర్లు, తమ్మినేని సుజాతరెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, పోలక సిద్దారెడ్డి, డాక్టర్ రసూల్, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, గంగసాని హుస్సేన్ రెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, గయాజ్, దుర్గారెడ్డి, జీ శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కటికల వెంకట రత్నం, జీ ఆదినారాయణరెడ్డి, మేడికొండ జయంతి, ఓమోగా రామిరెడ్డిలు ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు చప్పిడి సుబ్బయ్య, నుసుం వెంకటరెడ్డి, టీ రత్నరాజు, పార్టీ నాయకులు జీ బొర్రారెడ్డి, యక్కంటి శ్రీను, గజ్జల వెంకటరెడ్డి, ఓకేరెడ్డి, పాలగొల్లు మల్లి కార్జునరెడ్డి, పోలు జయరాంరెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డి, మితికల గురవయ్య యాదవ్, భువనగిరి వెంకటయ్య, పొల్ల సుబ్రహ్మణ్యం, తాతపుడి సురేష్, నానీ, దుగ్గిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, రాచపుడి మాణిక్యరావు, సిరుప వెంకట గోవర్దన్‌రెడ్డి, సుంకర సునీత బ్రమరాంరెడ్డి, కే కృష్ణా, చింత శ్రీనివాసులరెడ్డి, వీ వెంకటరెడ్డి తూము వెంకట రెడ్డి, సుబ్బయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.