
విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి
ముండ్లమూరు(దర్శి): నీళ్ల మోటారు స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నంబూరి పెద్ద జక్రయ్య(67) తన ఇంటిలో నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు స్పందించి రక్షించేలోగా మృతి చెందాడు. మృతునికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. మృతుడి కుమారుడు నంబూరి జాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ హనుమంతరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.