రైతులకు అన్నీ కష్టాలే | - | Sakshi
Sakshi News home page

రైతులకు అన్నీ కష్టాలే

Sep 10 2025 10:20 AM | Updated on Sep 10 2025 10:22 AM

చంద్రబాబు రైతు వ్యతిరేకి బాబు హయాంలో రైతు ఆత్మహత్యలు మార్కాపురంలో ఎమ్మెల్యే తాటిపర్తి, ఇన్‌చార్జిలు అన్నా, కేపీ

మార్కాపురం/మార్కాపురం టౌన్‌: కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే అని, దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మార్కాపురం, గిద్దలూరు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. మార్కాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో మంగళవారం వారు పాల్గొని మాట్లాడారు.

రైతు వ్యతిరేకి చంద్రబాబు: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

చంద్రబాబు రైతు వ్యతిరేకి అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కజొన్న, వరి వేస్తున్నారని, దీంతో యూరియా, ఇతర ఎరువులు అవసరమవుతున్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇలాంటి ఎరువులన్నీ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎరువులను 50 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెచ్చారని ఆర్‌బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, రైతులకు గ్రామాల్లోనే లభించాయని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎరువులు పక్కదారి పట్టాయని అన్నారు. దీంతో రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కారని చెప్పారు. అధికారంలోకి రాగానే వెలుగొండ పూర్తిచేస్తామని చెప్పి 15 నెలలు గడిచినా రూ.100 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదన్నారు. వెలుగొండ పూర్తయితేనే కరువు పోతుందన్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం టీడీపీ నాయకులు మట్టి, ఇసుక, మైనింగ్‌ దేనినీ వదిలిపెట్టడంలేదని విమర్శించారు.

రైతులకు అండగా వైఎస్సార్‌ సీపీ: అన్నా రాంబాబు

వైఎస్సార్‌ సీపీ రైతులకు అండగా ఉంటుందని మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా అన్నీ ఉన్నాయని, గిట్టుబాటు ధరలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం పంటలబీమా ఇలాంటి పథకాలన్నీ ఉండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతును కంటికి రెప్పలా చూసుకున్న ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు భరించలేని కష్టాలు వచ్చాయని అన్నారు. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లిపోవడంతో పంటలకు ఎరువు దొరకదన్న ఆందోళన రైతుల్లో నెలకొందని అన్నారు.

రైతుల పథకాలు నిర్వీర్యం: కేపీ నాగార్జునరెడ్డి

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని అన్నారు. ఏటా రైతు భరోసా, సున్నావడ్డీకే రుణాలు, పైసా ఖర్చులేకుండా పంటల బీమా అమలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్‌ఎస్‌కేలను నిర్వీర్యం చేసిందని, ఏడాదికి రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానని చెప్పి మొదటి ఏడాది ఇవ్వలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సంక్షేమం కోసం వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరే షన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ షంషేర్‌ ఆలీబేగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాజీ సభ్యుడు వెన్న హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అన్నీ కష్టాలే1
1/1

రైతులకు అన్నీ కష్టాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement