బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలో చిన్నారుల సత్తా | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలో చిన్నారుల సత్తా

Sep 8 2025 5:02 AM | Updated on Sep 8 2025 5:02 AM

బెల్ట

బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలో చిన్నారుల సత్తా

బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలో చిన్నారుల సత్తా క్రికెట్‌ అండర్‌–14 బాలుర జిల్లా జట్టు ఎంపిక వాగులో పడి వృద్ధుడు మృతి

ఒంగోలు: ఇంటర్నేషనల్‌ తైక్వాండో ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్‌ రీడింగ్‌ రూం ఆవరణలో ఒంగోలు తైక్వాండో అసోసియేషన్‌ చిన్నారులకు ఆదివారం బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరైన చిన్నారులు సత్తా చాటి వివిధ రకాల బెల్ట్‌లను కై వసం చేసుకున్నారు. బాలుర విభాగంలో రుత్విక్‌ కృష్ణ, రోహిత్‌, షాదాబ్‌, శివ సూర్యప్రకాష్‌, జితేష్‌రెడ్డి, ముస్తఫా, లోహిత్‌, షియాబ్‌, మోహిత్‌ రెడ్‌ బెల్టులు, హేమంత్‌ నాగసాయి బ్లాక్‌ బెల్టు కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో రవితరణి, సహస్ర రెడ్‌ బెల్టులు, సాదియా అన్‌జుం, యశస్వి ఎల్లో బెల్టులు సాధించారు. ఎగ్జామినర్‌గా మాస్టర్‌ షేక్‌ కరిముల్లా వ్యవహరించగా, చిన్నారులను జాతీయ తైక్వాండో మాస్టర్‌ బీవీ రమణయ్య, షేక్‌ ఖలీఫాతుల్లా బాషా అభినందించారు. కార్యక్రమాన్ని బ్లాక్‌ బెల్ట్‌ 2వ డాన్‌ షేక్‌ ఆరిఫ్‌, బ్లాక్‌ బెల్ట్‌ ఒకటో డాన్‌లు షేక్‌ షబ్బీర్‌, అభిషేక్‌, విఘ్నేష్‌ పర్యవేక్షించారు.

ఒంగోలు: క్రికెట్‌ అండర్‌–14 బాలుర జిల్లా జట్టును ఆదివారం స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ సబ్‌ సెంటర్‌ నెట్స్‌లో ఎంపిక చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 90 మందికిపైగా క్రీడాకారులు హాజరవగా, వారి నైపుణ్యాలను పరీక్షించి 39 మందిని ప్రాథమికంగా ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి మాజీ క్రీడాకారుడు సీహెచ్‌ విజయ్‌కుమార్‌ పరిశీలించారు. ప్రాథమికంగా ఎంపికై న 39 మందికి బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోని క్రికెట్‌ స్టేడియంలో పలు మ్యాచ్‌లు నిర్వహించి బ్యాటింగ్‌, బౌలింగ్‌, కీపింగ్‌, ఫీల్డింగ్‌ అంశాలలో నైపుణ్యాలను పరిఽశీలించిన అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. తుది జట్టుకు ఎంపికై న 16 మంది అక్టోబరు నెలలో జరిగే అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, నల్లూరి రవి, ఉండవల్లి రాము, నాదెండ్ల శ్రీను, కొప్పోలు సుధాకర్‌, లెఫ్ట్‌ శ్రీను, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

జరుగుమల్లి(సింగరాయకొండ): ప్రమాదవశాత్తు ముసి వాగులో పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం...జరుగుమల్లి మండలం పాలేటిపాడు పంచాయతీ పీఎంవీ కండ్రిక గ్రామానికి చెందిన వెంకటేష్‌ ఈ నెల 5న ఇంటి పందిరి కర్రల కోసం వాగు అవతలకు వెళుతున్నానని సోదరుడు వెంకట్రావుకు చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో వెంకటేష్‌ మద్యం మత్తులో ఉన్నాడు. అయితే ఆ తరువాత నుంచి వెంకటేష్‌ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం వాగు వెంబడి వెతికినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వాగు ఒడ్డున మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా వెంకటేష్‌ మృతదేహంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.

బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలో చిన్నారుల సత్తా 1
1/1

బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలో చిన్నారుల సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement