
రైతును ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేలకు లేదా..
పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా.? రైతుల ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలుగా జిల్లాలో గెలిచారు కదా.. మరెందుకు పొగాకు రైతుల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఏదో నామమాత్రంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రి స్వామి పొగాకు రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదో ప్రజలకు చెప్పాలి. ఇంతటి తీవ్రమైన కరువులో జిల్లా రైతాంగం ఉండటంతో పాటు పొగాకు రైతు కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పొదిలి వేలం కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ధరలో కొద్దిగా కదలిక వచ్చింది. ఆ తర్వాత యథావిధిగానే వ్యాపారులు కూటమి కట్టి మరీ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.
– చుండూరు రవిబాబు, వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
లో గ్రేడ్ కోసం
రూ.1000 కోట్లు కేటాయించాలి
జిల్లాలోని రైతుల వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకు కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయిస్తేనే ఈ సంక్షోభం తీరుతుంది. క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలి. ఈ ఏడాది వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కంపెనీలు, బోర్డు సూచనలకు అనుగుణంగా సాగుచేసిన రైతుకు సరైన దిగుబడులు రాక, గిట్టుబాటు ధర లభించక, వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరక్క తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
– పమిడి వెంకట్రావు, ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి

రైతును ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేలకు లేదా..