
అన్నదాతలను పట్టించుకోని ప్రభుత్వం
ఒంగోలు సిటీ:
కూటమి ప్రభుత్వ లోప భూయిష్ట నిర్ణయాలతో రైతులకు సకాలంలో ఎరువులు అందక, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సాగుచేసిన పంటలకు కనీసం పెట్టుబడులు కూడా రాక జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు తొట్టెంపూడి దిలీప్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు చనిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చనిపోయిన రైతు కుటుంబాలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో వ్యవసాయ భూముల్లో సీఎం చంద్రబాబు షో చేసి వెళ్లిపోయారని విమర్శించారు. జిల్లాలో వేలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా పడలేదని మండిపడ్డారు. నగదు కోసం వారంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. తెగుళ్లు, ప్రకతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగానే పంపిణీ చేసిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులను బస్తాకు రూ.100 నుంచి రూ.255 వరకు పెంచి విక్రయిస్తున్నా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.
గిట్టుబాటు ధర కల్పనలో విఫలం
కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మామిడి కిలో రూ. 29 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది రెండు రూపాయలే రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నగదు మొత్తాన్ని 24 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలో తమ చేస్తానని చెప్పిన ప్రభుత్వం, నెలలు గడిచినా జాడలేదని ఆరోపించారు. టమోటా, పత్తి, మిర్చి, శనగ, రొయ్యల రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు.
పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణం..
పండించిన పొగాకు మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు రైతుకు 20 చెక్కులకే పరిమితం చేయటం ఏంటని ప్రశ్నించారు. వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లలో అధిక సంఖ్యలో తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం
ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు
ఎరువుల పంపిణీ, గిట్టుబాటు ధరలు కల్పించడంలో వైఫల్యం
అన్నదాత సుఖీభవ నగదు పడక
అన్నదాతల అవస్థలు
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి