
స్కూటర్‌ను ఢీకొట్టిన క్యాష్ ట్రక్
కొనకనమిట్ల: రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన ఒంగోలు–గిద్దలూరు హైవేపై చినారికట్ల జంక్షన్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. చినారికట్లకు చెందిన సోము సుబ్బారెడ్డి, సుశీల దంపతులు తమ పొలం నుంచి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒంగోలు నుంచి వస్తున్న ఓ క్యాష్ పికప్ ట్రక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి, సుశీల దంపతులకు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకరరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బ్యాంక్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.