
వైఎస్ జగన్‌ను కలిసిన శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం తాడేపల్లిలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను శివప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మ పరామర్శించారు. పార్టీ, తాము అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఒక బీసీ మహిళ పార్టీ సమావేశానికి వెళ్తుంటే ఆమె వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆమైపె దాడికి పాల్పడడం సబబుకాదన్నారు. అనంతరం వారు తాడేపల్లిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.