
వైఎస్సార్ విగ్రహం తొలగింపునకు కుట్ర
మార్కాపురం టౌన్: పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్(కుంట) సెంటర్‌లో సుమారు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీసీపీ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ త్రివినాగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గుంటూరు, కర్నూలు బైపాస్ రోడ్డు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం లేకపోయినా వైఎస్సార్ విగ్రహన్ని తొలగించాలని అధికారులతో కలిసి కొందరు రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విగ్రహాన్ని తొలగించాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. అర్జీ ఇచ్చినవారిలో సర్పంచ్ మల్లేశ్వరి, నాయకులు లక్ష్మీనారాయణ, మేకల కాశయ్య, ఎస్‌కె నూర్ అహ్మద్, రామచంద్రుడు, నారాయణ, దానం, సుబ్బారావు, నాగార్జునరెడ్డి, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.
సబ్ కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ నేతల అర్జీ