
జగనన్న పర్యటనను విజయవంతం చేద్దాం
ఒంగోలు టౌన్:
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయవంతం స్ఫూర్తితో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు జిల్లాకు వస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను కూడా విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు బోర్డు వద్దకు జగన్ వస్తున్నారని తెలిపారు. పొగాకు రైతులకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వైఎస్సార్ సీపీ పాలనలో మంచి గిట్టుబాటు ధర లభించిందని తెలిపారు. కూటమి పాలనలో పొగాకుకు సరైన ధరలు లేక, అమ్ముడుపోక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు.
అందరికీ ధన్యవాదాలు...
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన జగనన్న సైనికులు ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చుండూరి రవిబాబు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంటు ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, హాజరైన నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశాన్ని బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్‌రావు, మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల కమిటీల నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సార్ సీపీ సైన్యానికి ధన్యవాదాలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు