సత్తాచాటిన బసినేపల్లె ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని చింతలపాలెం వీరాంజనేస్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బేస్తవారిపేట మండలం బసినేపల్లెకు చెందిన వెంకట చైతన్యకుమార్ ఎడ్లు, గిద్దలూరు మండలం బురుజుపల్లెకు చెందిన వెంకట సోహిత్ ఎడ్లు, రాచర్ల మండలం కుంటకాడిపల్లికి చెందిన దందూరి శ్రీనివాసులు, బి.భూపాల్ సంయుక్త ఎడ్ల జత, కంభం మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన హేమలత నాయుడు ఎడ్లు వరుసగా మొదటి, రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున దాతల చేతులమీదుగా అందజేశారు.


