
ఘనంగా వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం గురువారం కాగా ముందస్తుగా బుధవారం ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గా ఇన్‌చార్జులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్‌చార్జులు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, బీసీ నాయకుడు బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్ తదితరులు సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు.