మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. వీరి వెంట ఎంపీపీ లక్ష్మిదేవీ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు దేవండ్ల లక్ష్మమ్మ, లయోల చెంచిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ, పలువురు ఎంపీటీసీలు ఉన్నారు.