నిలదీసి.. | - | Sakshi
Sakshi News home page

నిలదీసి..

Mar 13 2025 11:35 AM | Updated on Mar 13 2025 11:31 AM

నినదించి..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు. ప్రతి మూడు నెలలకొకసారి రూ.700 కోట్ల ప్రకారం ఏడాదికి రూ.2100 కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. వసతి దీవెనకు రూ.1100 కోట్లు ఇవ్వాలని, అయితే బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి ఒట్టి చేతులు చూపారని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం రోజున విద్యార్థులకు అండగా పోరాటం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు పాలనలో యువత అనేక ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ ఇవ్వలేకపోతే అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మార్కాపురంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను నిలిపేసి నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేసిందని ధ్వజమెత్తారు.

ఒంగోలు సిటీ/ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించిందని, వారి భవిష్యత్‌ను కాలరాస్తోందని ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో బుధవారం నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తొలుత డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్‌ నుంచి భారీ ర్యాలీగా బయలు దేరారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌, వైఎస్సార్‌ విగ్రహాలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణయాదవ్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ సీనియర్‌ నాయకులు మాదాసి వెంకయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ వైఎం ప్రసాద్‌రెడ్డి, రెడ్డి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్‌లోకి వీరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానగేట్లన్నీ మూసివేశారు.

ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలకులు విద్యార్థులకు, యువతకు చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర శంఖాన్ని పూరించిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల కోసం గోరుముద్ద, వసతిదీవెన, విద్యాదీవెన, అమ్మ ఒడి వంటి పథకాలు అందించి అండగా నిలిచారన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌, తల్లికి వందనం, వసతి దీవెన పథకాలు అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని అమలు చేయలేని, దద్దమ్మ పాలకులుగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. విద్యాశాఖను గాలికి వదిలేసి సంబంధిత శాఖ మంత్రి విదేశాల్లో జల్సాగా తిరుగుతున్నాడని విమర్శించారు. లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రానికి వచ్చే కంపెనీలు పారిపోతున్నాయన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.4600 కోట్ల బకాయిలు ఇచ్చేందుకు ముగ్గురు పెద్ద మనుషులకు చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏదో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకుల చేతకాని తనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మార్కాపురంను జిల్లా చేస్తామని హామీ ఇచ్చి దానిని అమలు చేయకుండా చంద్రబాబు నిస్సిగ్గుగా జిల్లాకు వచ్చి వెళ్లారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన మహిళను నీకు ఓటు ఉందా అని ప్రశ్నించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం యువతను మోసగించడమేనని, ప్రతి ఒక్కరూ దీనిని గమనించి కూటమి నేతలను నిలదీయాలని, గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడని ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో మాట మార్చిన నాయకులపై 420 కేసు నమోదు చేయాలన్నారు.

మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డీఎస్సీ ఫైలుపై చేసిన తొలిసంతకం ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం సిగ్గు చేటన్నారు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతలో ఆశలు రేపి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అటకెక్కించారన్నారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలతో 2500 మెడికల్‌ సీట్లను రాష్ట్రం కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరు రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటి వరకు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు.

కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఒంగోలు మండల అధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, యూత్‌ వింగ్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు మల్లిశెట్టి దేవా, నియోజకవర్గ స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కె.వెంకటప్రసాద్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఫ్లోర్‌లీడర్‌ ఇమ్రాన్‌ఖాన్‌, కార్పొరేటర్‌ ప్రవీణ్‌కుమార్‌, కార్పొరేటర్‌ వెన్నపూస కుమారి, పేరం ప్రసన్న, బడుగు ఇందిర, సీనియర్‌ నాయకులు బొట్ల రామారావు, దుంపా చెంచిరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ సాగరు, నాగూరు, రషీదా పాల్గొన్నారు.

కూటమి నిర్లక్ష్యంపై యువత గర్జన..

అభ్యర్థుల భవితను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం

ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి

జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి

‘యువత పోరు’కు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

సంక్షేమ పథకాలను అటకెక్కించడమే కాకుండా తమ భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ విద్యార్థులు, యువత తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై గర్జించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘‘యువత పోరు’’ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

ర్యాలీలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆదిమూలపు సురేష్‌, నాగార్జునరెడ్డి, చుండూరి, జంకె

నిలదీసి..1
1/9

నిలదీసి..

నిలదీసి..2
2/9

నిలదీసి..

నిలదీసి..3
3/9

నిలదీసి..

నిలదీసి..4
4/9

నిలదీసి..

నిలదీసి..5
5/9

నిలదీసి..

నిలదీసి..6
6/9

నిలదీసి..

నిలదీసి..7
7/9

నిలదీసి..

నిలదీసి..8
8/9

నిలదీసి..

నిలదీసి..9
9/9

నిలదీసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement