విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా

Published Sat, Sep 30 2023 7:36 AM

విద్యార్థులతో మాట్లాడుతున్న స్టెప్‌ సీఈఓ 
లోకేశ్వరరావు  - Sakshi

మద్దిపాడు:విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చే విధంగా పదో తరగతి తర్వాత వివిధ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని స్టెప్‌ సీఈఓ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు తెలిపారు. మద్దిపాడు మండలంలోని తెల్లబాడు జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్‌ గారి అతిథి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 9, 10 తరగతుల విద్యార్థులు పదో తరగతి తర్వాత చేయాల్సిన కోర్సుల్లో కనీసం ఐదు నుంచి పది కోర్సుల గురించి తెలుసుకుని సరైన కోర్సును ఎంపిక చేసుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్తును మంచిగా మలచుకోవాలన్నారు. మూసగా అందరూ ఎంపీసీ, బైపీసీ అంటూ వెళ్తుంటారని, కానీ, అనేక రకాల ఇతర మంచి కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. వాటిలో సరైన కోర్సును ఎంపిక చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అనువుగా ఉంటుందన్నారు. విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ డీఈఓ టి.భరద్వాజ్‌, డీఎస్‌డీఓ ఆర్‌.లోకనాథం, స్టెప్‌ మేనేజర్‌ పీ శ్రీమన్నారాయణ, కెరియర్‌ గైడెన్స్‌ మెంటర్‌ ఎస్‌కే షహనాజ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్‌ ఖాదర్‌బాషా, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్టెప్‌ సీఈఓ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు

Advertisement
 
Advertisement