
వీడియో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
● కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: జలజీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ప్రతి ప్రభుత్వ భవనానికి కుళాయి నిర్మించాలన్నారు. అన్నీ అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఎంపీడీవోలు జిల్లాలో మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ 90 రోజులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలన్నారు. హార్టీకల్చర్ ప్లాంటేషన్ వచ్చే నెల మొదటి వారంలోపు పూర్తి చేయాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌ను వచ్చేనెల రెండో తేదీ నాటికి కచ్చితంగా పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆడిట్ నగదును రికవరీ చేయాలన్నారు. సచివాలయాల్లో సర్వీసులకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా రెండు పూటలా బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, సీపీవో వెంకటేశ్వుర్లు, డ్వామా పీడీ శ్రీనారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మర్దన్ అలీ, హౌసింగ్ పీడీ పేరయ్య, ఇరిగేషన్ ఎస్‌ఈ లక్ష్మారెడ్డి, సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.