సుధాకర్‌ను పరామర్శిస్తున్న వైఎస్సార్ టీఎఫ్ నాయకులు
మార్కాపురం: ఉపాధ్యాయుడిపై ఎంఈఓ దాడి చేసిన సంఘటన బుధవారం పెద్దదోర్నాలలో చోటుచేసుకుంది. వివరాలు.. చిన్నదోర్నాల ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.సుధాకర్ ఆగస్టు నెల జీతం గురించి అడిగేందుకు ఎంఈఓ మస్తాన్ నాయక్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఎంఈఓ దుర్భాషలాడుతూ గొంతు పట్టుకుని దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బంధువులు బుధవారం మధ్యాహ్నం మార్కాపురంలోని జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న సుధాకర్‌ను వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, పలువురు నాయకులు పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. దోర్నాల మండలంలో ఎవరైనా ఉపాధ్యాయులు మెడికల్, స్టడీ లీవ్ అడిగితే ఇవ్వకుండా ఎంఈఓ ఇబ్బంది పెడుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త
వైఎస్సార్ టీఎఫ్ నేతల పరామర్శ


