పేదల సొమ్ము కొల్లగొట్టిన టీడీపీ | - | Sakshi
Sakshi News home page

పేదల సొమ్ము కొల్లగొట్టిన టీడీపీ

Sep 16 2023 2:22 AM | Updated on Sep 16 2023 2:22 AM

వృద్ధుని వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని   - Sakshi

వృద్ధుని వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని

ఒంగోలు సబర్బన్‌: పేదల సొమ్మును టీడీపీ పాలకులు కొల్లగొట్టారని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. 5వ డివిజన్‌లోని రెండో వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. డివిజన్‌లోని బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌కు తూర్పు వైపున ఉన్న మహేంద్ర నగర్‌ నాలుగో లైన్‌ నుంచి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ జీవిత కాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లుగా వాళ్ళు భ్రమించి పేదలను నిలువునా మోసం చేసే కార్యక్రమానికి తెర లేపారన్నారు. ఒంగోలు నగరంలోని నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ళు కట్టిస్తామని నమ్మబలికి వారి వద్ద వేలకు వేలు డబ్బులు కట్టించుకొని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ఇళ్ళు ఇవ్వక పోగా వాళ్ళు కట్టిన డబ్బులు కూడా వాళ్ళకు ఇవ్వకుండా చేశారని మండి పడ్డారు. ఆ పేదల కడుపు కొట్టినందువల్లే టీడీపీ భూస్థాపితం అయిందన్నారు. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళుతుంటే.. అయ్యా టిడ్కో ఇళ్ళకు డబ్బులు కట్టాము, ఇళ్ళు ఇవ్వక పోగా, తాము కట్టిన డబ్బులు కూడా ఇవ్వటం లేదని ఆ నిరుపేదలు వాపోతున్నారని బాలినేని వివరించారు. అందుకే ముందు వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకు తిరిగి ఇస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. ఆ తరువాత వాళ్లందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి అనంతరం ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుందని వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. 14,400 మంది వద్ద డబ్బులు కట్టించుకున్న టీడీపీ పాలకులు 4 వేల ఇళ్ళు మాత్రమే ప్రారంభించి నిలువునా మోసం చేశారని మండి పడ్డారు. ప్రతి గడపలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికీ ధైర్యంగా తిరుగుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎందేటి పద్మావతి రంగారావు, బొమ్మినేని మురళి, ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌ కొఠారి రామచంద్రరావు, పార్టీ నాయకులు కఠారి శంకర్‌, పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతి రావు, పార్టీ సాస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్ట సుబ్బారారు, చింతగుంట్ల సువర్ణ, పుచ్చకాయల గోవర్దన్‌ రెడ్డి, గొర్రెపాటి శ్రీనివాస రావు, పురిణి ప్రభావతి, చావల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు చల్లా తిరుమలరావు, ఽజడా వెంకటేష్‌, 5వ డివిజన్‌ అధ్యక్షుడు సి.హెచ్‌.సత్య నారాయణ రెడ్డి, జమ్ము శ్రీకాంత్‌, తాళ్ళపాలెం శ్రీను, సైదా, వాకా తిరుమల, పి.మోహన్‌ రావు, ఆసోది విజయలక్ష్మి, ఎస్‌కే.ఖుద్దూస్‌, రామిశెట్టి హరి, ఆవుల సురేంద్ర, గొల్లపోలు కృష్ణ, జాజుల కృష్ణ, రావులపల్లి శ్రీకాంత్‌, కఠారి సురేష్‌, మిరియం సుబ్బులు, గఫూర్‌, అబ్దుల్‌ ఖుద్దూస్‌, దాసరి అమ్మన్న, మద్దసాని సుబ్బారావు, హైమావతి, పులి కృష్ణ, మిరియం వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

టిడ్కో పేరుతో డబ్బు వసూలు చేసిన దామచర్ల

పేదలకు ఆ డబ్బులు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చెల్లిస్తోంది

14,400 మంది వద్ద డబ్బు కట్టించుకొని 4 వేల ఇళ్లు మొదలు పెట్టారు

ప్రతి ఇంటికీ వచ్చిన సంక్షేమ పథకాలు చదివి వినిపించిన ఎమ్మెల్యే బాలినేని

5వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం

స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 1
1/1

స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement