‘పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే’

YSRCP MLAs Serious Comments Over Chandrababu On Bus Yatra - Sakshi

సాక్షి, ఇచ్చాపురం: వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. 

ఇక, బస్సు యాత్ర సందర్భంగా ఇచ్చాఫురం బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పలాలు డైరెక్ట్‌గా ఇస్తున్నాం. ప్రజలు అది గమనించాలి. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. అవినీతి లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఏ ఒక్కరూ తలవంచకుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. 

రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉంది. సిల్క్ కుంభకోణం కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. ఈడీ, ఐటీల వద్ద స్కిల్‌ స్కామ్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్. ఇక్కడ ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో మనం గెలవాలి. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే. మంచి భవిష్యత్తు ఉండాలని బడి, వైద్యం, విద్య అందించాం. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి అని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం క్యాడర్ అందరూ పనిచేయాలని కోరారు. 

సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మత్స్యకార సోదరులారా మన సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళితే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు. గడిచిన ఎన్నికల్లో తొక్కతీసి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం. ఎస్సీ, ఎస్టీలో పుట్టడానికి మనం కోరుకుంటామా అని చంద్రబాబు అన్నారు. కానీ, మన ప్రభుత్వంలో దళితుడే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు. వైద్యం, విద్యను  పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు..

బహిరంగ సభలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన సీఎం జగన్‌ వల్లే. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం జగన్‌ వచ్చాక  స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారు. విద్యలో ఇంగ్లీష్‌ మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారు. సీఎం జగన్‌ ముఖ్యమంత్రి కావడం వల్లే మన కులాలు మంచి స్థితిలో ఉన్నాయి. పేదల పక్షపాతి సీఎం జగన్‌.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top