
కృష్ణాజిల్లా: నాగాపురంలో 21 మంది దళితులకు 42 ఏళ్ల క్రితం ప్రభుత్వమే భూమి ఇచ్చిందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ దాని మీదే వారు జీవనం గడుపుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఇప్పుడు దళితులకి ఆ రోజు ఇచ్చిన భూమి తనదేనంటూ ఓ ప్రైవేటు వ్యక్తి కోర్టుకెళ్లాడని, ప్రభుత్వమే ఆ ప్రైవేటు వ్యక్తి మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. ఈ రాష్ట్రంలో దళితులకు అంబేద్కర్ రూపొందించిన చట్టం ఉందని, చట్ట ప్రకారం ఆ భూములు దళితులకే దక్కుతాయని మేరుగ స్పష్టం చేశారు.
‘తప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చిన వారి పై కేసులు పెట్టాలి. అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు. దళితులకు అండగా ఉండేందుకు మేం వస్తే నోటీసులిచ్చారు. ఏ ఉద్ధేశంతో నోటీసులుచ్చారు. ఏ ఉద్ధేశంతో దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు దళితుల భూమిని ఎందుకు లాక్కోవాలని చూస్తున్నారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి దళితుల చట్టాలు పక్కాగా అమలయ్యాయి రాజ్యాంగ బద్ధంగా జగన్ పాలన సాగింది. అంబేద్కర్ ,పూలే ఆలోచనలు వర్ధిల్లాయి. కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. నాగాపురంలో దళితుల పై జరుగుతున్న దౌర్జన్య కాండ ఇందుకు నిదర్శనం. వైఎస్సార్‌సీపీ తరపున మేం అండగా ఉంటాం. నాగాపురం దళితుల భూముల కేసును కృష్ణాజిల్లా కలెక్టర్ సుమోటోగా తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.