ఇంత దారుణం జరిగినా చీమకుట్టినట్లైనా లేదా బాబూ?: వరుదు కల్యాణి | Ysrcp Leader Varudu Kalyani Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఇంత దారుణం జరిగినా చీమకుట్టినట్లైనా లేదా బాబూ?: వరుదు కల్యాణి

Oct 13 2024 8:24 PM | Updated on Oct 13 2024 8:26 PM

Ysrcp Leader Varudu Kalyani Fires On Chandrababu Govt

సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అత్తా, కోడళ్లపై లైంగిక దాడి ఘటనపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి స్పందించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.

ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి, కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా కల్పించలేకపోవడం శోచనీయమన్నారు. మచ్చుమర్రి ఘటనతో సహా రాష్ట్రంలొ రోజుకొక దారుణం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్న వరుదు కళ్యాణి.. మహిళల రక్షణకు కనీస చర్యలు తీసుకోవడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్, దిశ చట్టాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితులు లేకపోగా.. హిందూపురం ఘటనతో ఇంట్లో ఉన్నా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  హిందూపురం ఘటనలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: సునీల్‌ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement