రేపు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Meeting With YSRCP Leaders On May 27 | Sakshi
Sakshi News home page

రేపు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ

May 26 2026 7:50 AM | Updated on May 26 2026 8:49 AM

YS Jagan Meeting With YSRCP Leaders On May 27

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 27న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్‌ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్‌ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement