నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan to Hold Key Talks with PAC Members | Sakshi
Sakshi News home page

నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Apr 21 2025 8:24 PM | Updated on Apr 22 2025 5:51 AM

YS Jagan to Hold Key Talks with PAC Members

తాడేపల్లి,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (మంగళవారం) అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమా­వేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్‌ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఇటీవల, వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని  పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.

పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)

..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి

..మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్‌ బెపారి అంజాద్‌ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement