రాజ్యసభ ఉప ఎన్నికకు సుశీల్‌ మోదీ నామినేషన్

Sushil Modi files nomination for Rajya Sabha by-election as NDA candidate - Sakshi

 పాట్నా: పాట్నాలో రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. లోక్‌ జనశక్తి పార్టీ నేత, కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం తరువాత  ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి  బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపిక చేసింది. కాగా  ‘సుశీల్‌ మోదీకి మా పూర్తి మద్దతు’ ఉంటుందని  బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. డిసెంబర్ 14న ఉప ఎన్నిక జరుగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్ బంధన్ కూడా పోటీ చేయనుంది.  చదవండి(చిరాగ్‌కు మద్దతు ప్రకటించిన తేజస్వీ). 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top