విలీన ఊహాగానాల నడుమ.. రాహుల్‌కు వైఎస్‌ షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు

Sharmila Rahul Gandhi Bday Tweet spills beans YSRTP Merge Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఎందులోనూ విలీనం చేయబోనని ప్రకటిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల.. తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారామె.

ఇవాళ(జూన్‌ 19)  రాహుల్‌ గాంధీ 53వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌లో.. రాహుల్‌ గాంధీ గారు.. మీకు సంతోషకరమైన, అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. మీ హృదయపూర్వక ప్రయత్నాల ద్వారా వాళ్లకు సేవ చేస్తూ ఉండండి. గొప్ప ఆరోగ్యం, ఆనందంతో సమృద్ధిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని శుభాకాంక్షలు తెలియజేశారు. 

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతరేకంగా ఆమె 3వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసిరావాలంటూ విపక్షాలకు సైతం ఆమె పిలుపు ఇచ్చారు.  

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ టీపీని ఆమె విలీనం చేస్తారని, ఈ మేరకు సోనియాగాంధీతోనూ ఆమె చర్చలు జరిపారంటూ ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి. ఈలోపు ఆమె కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ను కలవడం, పార్టీలోని కీలక సభ్యులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల హామీతోనే ఆమె కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాల నడుమ తాజా పరిణామం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఇదీ చదవండి: పీసీసీ సర్వే.. ట్విటర్‌లో రాములమ్మ!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top