సీఎం రేవంత్‌కు బిగ్‌ షాక్‌.. రాజగోపాల్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ | MLA Komatireddy Raj Gopal Reddy Political Counter To CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు బిగ్‌ షాక్‌.. రాజగోపాల్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Jul 19 2025 9:20 AM | Updated on Jul 19 2025 11:17 AM

MLA Komatireddy Raj Gopal Reddy Political Counter To CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్‌ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement