ఇసుకలో నొక్కేశారు‌..అందుకే కేసు: బొత్స | Sakshi
Sakshi News home page

ఇసుకలో నొక్కేశారు‌..అందుకే కేసు: బొత్స

Published Sat, Nov 4 2023 3:06 PM

sand scam happens in tdp regime says botsa - Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లాలో సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో పేదలందరినీ  అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ పనిచేస్తున్నారని చెప్పారు.

జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ ఎంతో మానవత్వం ప్రదర్శించారని చెప్పారు బొత్స. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దండుకున్నారన్నారు. ఇసుకలో అవినీతి జరిగినందునే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మాణాలు చేపట్టామని బొత్స తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement