వైఎస్సార్‌సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్‌ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు | Sajjala Ramakrishna Reddy Key Comments On Exit Polls | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్‌ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు

Published Sat, Jun 1 2024 9:13 PM | Last Updated on Sat, Jun 1 2024 9:17 PM

Sajjala Ramakrishna Reddy Key Comments On Exit Polls

ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్‌ వైఎస్సార్‌సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్‌ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సాక్షి, తాడేపల్లి: ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్‌ వైఎస్సార్‌సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్‌ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. 

‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్‌ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్‌సీపీకి పాజిటివ్‌ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్‌సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement