చంద్రబాబు జోకర్‌లా మారితే ఎలా?

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షం పాత్ర ఎలా పోషించాలో టీడీపీకి తెలీదని, దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలియవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఆరు నెలలుగా పక్క రాష్ట్రంలో అజ్ఞాత వాసిగా కాలం గడుపుతున్నారు. అక్కడ నుంచి ఆయన డీజీపీకి లేఖాస్త్రం సంధించారు.అసలు ఆయన సమస్య ఏమిటో తెలుసుకుందామనుకుంటున్నా. ప్రతిపక్షాలు సాధారణంగా ప్రభుత్వంపై, అధికార పార్టీపై పోరాటం చేస్తాయి. ప్రతిపక్షం పాత్ర ఏమిటి.. నిజమైన ప్రతిపక్షంలా ఎలా ఉండాలో తెలిసినట్లు లేదు. ఆయనకు తెలిసింది ఒకటే. అధికారంలో ఉండటం. అది ఎంత షార్ట్ కట్ లో వస్తుంది... గోడ దూకితే వస్తుందా అని చూస్తాడంటూ’ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. (చదవండి‘అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి’)

‘‘డీజీపీ పదవిలో ఉన్న అధికారి బదులివ్వాలంటే పరిధులు ఉంటాయి. ఇంతకు ముందు సీఎస్‌కు రాశారు. దీన్ని తీసుకుని మళ్లీ కోర్టులకు వెళ్తారేమో. ఇలా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 1600 కేసులు నిజంగా వస్తే మీడియా ఊరుకుంటుందా. కనీసం ఆయనకు ఇంగితం కూడా లేదా...ఆయనకు వయసు పెరిగితే ఆయన్ను అనను. కనీసం పక్కనున్న వాళ్లయినా చెప్పాలి కదా. చిత్తూరు లో 4 కేసులకు గాను 400 కేసులు అని పొరపాటుగా వచ్చింది. ఇలా కొన్ని తప్పులు ఉన్నాయి. కరెక్షన్ కి కూడా పంపాం. పరిశీలిస్తున్నారు.

మీరేమి న్యూస్ పేపర్ రిపోర్టర్ కాదు.. తక్షణమే స్పందించడానికి కొంచెం వాస్తవాలు తెలుసు కోవాలి కదా కేవలం డీజీపీకే ఎందుకు రాస్తున్నారు. సత్తార్ అనే కేసులో అరెస్ట్ చేశారు. ఛార్జ్ షీట్ కూడా వేసి విచారణ జరుగుతుంది. నిందితులు ఎదురుగా ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ప్రభుత్వం పోరాడుతోంది. వైఎస్ జగన్ మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్తూ చిన్న కేసును కూడా వదలొద్దని చెప్పారు. రోజూ క్రైమ్ న్యూస్ వస్తుంది. దానిలో నిందితుడు పక్కనే వైఎస్సార్సీపీ అని పెట్టుకుంటాడేమో సంఘటనలు జరగవని చెప్పడం లేదు. పోలీసుల స్పందన ఎలా ఉందో చూడాలి. నిన్న ఉన్నట్టుండి కోవిడ్ వెబ్ సైట్ ఓపెన్ చేశారు. బడ్జెట్ చూడకుండా కోవిడ్ నివారణలో ఏపీ టాప్‌లో ఉందని ప్రపంచం అంతా గుర్తించింది. ఒక జోకర్ లా ఒకసారి జూమ్ మీటింగ్ కూడా పెట్టారు. ఏదన్నా చేస్తే సీరియస్ గా ఉండాలి. జోకర్ లా మారితే ఎలా..?’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. (చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top