రాహుల్‌ గాంధీకి ఊహించని అనుభవం | Rahul Gandhi Greeted With Modi-Modi Chants In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీకి ఊహించని అనుభవం.. అంతే బదులుగా

Mar 6 2024 7:23 AM | Updated on Mar 6 2024 9:28 AM

Rahul Gandhi Greeted With Modi-modi Chants In Madhya Pradesh - Sakshi

సాక్షి, మధ్యప్రదేశ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత,వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి ఊహించని అనుభవం ఎదురైంది. భారత్‌ జోడో న్యాయ బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ నినాదాలతో  హోరెత్తించారు. బదులుగా రాహుల్‌ గాంధీ వారికి ఫ్లయింగ్‌ కిస్‌లు ఇస్తూ ముందుకు సాగారు.  
 
మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌తో కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం తన యాత్రను కొనసాగించే క్రమంలో తన వాహనంలో బయలు దేరిన రాహుల్‌ గాంధీని ఓ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్తలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేస్తూ పలకరించారు. 

ఈ ఊహించని పరిణామంతో వెహికల్‌ దిగిన రాహుల్‌ గాంధీ నినాదాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లారు. యోగ క్షేమాలు అడిగి మరీ కరచాలనం చేశారు. బదులుగా బీజేపీ కార్యకర్తలు బంగాళాదుంపలను అందించారు. అనంతరం రాహుల్‌ గాంధీ ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ ముందుకు సాగారు.  

ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ‘నఫ్రత్ కా బజార్’ (ద్వేషం అనే మార్కెట్)లో ‘మొహబ్బత్ కి దుకాణ్‌’ (ప్రేమ దుకాణం) తెరవడం ద్వారా ఇటువంటి సంఘటనలను ఎదుర్కోవడం సులభం అవుతుందని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement