పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ను అలా ట్రీట్ చేస్తున్నారంటూ.. | Punjab CM Bhagwant Mann meets Kejriwal in Tihar jail | Sakshi
Sakshi News home page

పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ను అలా ట్రీట్ చేస్తున్నారంటూ..

Apr 15 2024 2:35 PM | Updated on Apr 15 2024 4:21 PM

Punjab CM Bhagwant Mann meets Kejriwal in Tihar jail - Sakshi

ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' కలిశారు. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్‌తో కలిసి వచ్చిన భగవంత్.. కేజ్రీవాల్‌తో అరగంట సేపు కలిసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థులకు అందించే కనీస సౌకర్యాలను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి అందించడంలేదని ఆయన ఆరోపించారు.

భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను  చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్‌లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.

ఇండియా బ్లాక్ అభ్యర్థుల ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పాఠక్ చెప్పారు.

జైలులో ఉన్నా.. ఆయన ఢిల్లీ ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం నుంచి సమస్యలపై చర్చించడానికి ఇద్దరు మంత్రులను పిలుస్తానని, అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన కోరినట్లు సందీప్ పాఠక్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement