టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి సవాల్‌ | Pinnelli Challenge to TDP MLA Julakanti Brahmareddy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి సవాల్‌

Apr 28 2026 9:22 PM | Updated on Apr 28 2026 9:24 PM

Pinnelli Challenge to TDP MLA Julakanti Brahmareddy

నరసరావుపేట: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. జూలకంటి బ్రహ్మారెడ్డి చేసే అవినీతి అక్రమాలు, తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 

‘జూలకంటి బ్రహ్మారెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఎవరో పిల్లలు గొడవపడి ఆయన కాన్వాయ్ పై సీసాలు వేస్తే అది వైఎస్సార్‌సీపీకి ఆపాదించడానికి జూలకంటి బ్రహ్మారెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. 

మా పార్టీకి ఆ దాడికి ఎటువంటి సంబంధం లేదు. జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు మట్టి, లిక్కర్, గుట్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రింగు లీడర్ గా మారారు. మాచర్లలో ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి అరాచకం చేస్తున్నాడు. జూలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం నాయకులే అసహ్యించుకుంటున్నారు. రెండేళ్లకే జూలకంటి బ్రహ్మారెడ్డి పనైపోయింది’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement