తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు | Massive Joins To Telangana Congress Party | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు

Published Fri, Oct 27 2023 12:35 PM | Last Updated on Fri, Oct 27 2023 1:43 PM

Massive Joins To Telangana Congress - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. వారికి మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పటాన్‌చెరు నుంచి బీఆర్‌ఎస్‌ తరపున టికెట్‌ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు.  

అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు. ‘‘కుటుంబ పాలనను అంతం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణ మలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంగా సాగిన కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన శుక్రవారం ఉదయం గంటన్నర పాటు సమావేశమైన సీఈసీ 53 స్థానాల అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
చదవండి: కాంగ్రెస్‌ మలి జాబితా ప్రకటనలో ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement