
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం రాకుండా సీఎం చర్యలు చేపట్టాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలకు కట్టుబ డి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ చెబుతున్నట్టుగా వస్తున్న వార్తలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మంచిది కాదని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక..ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక ఇప్పటికే చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజ రాత్‌కు వెళ్లిపోయిందని, కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని, ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతుందంటే తెలంగాణ ఇమేజ్ ఏం అవుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడు లను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసా గించాలని సూచించారు. అమరరాజా సంస్థ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డ విష యాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు.
సెబీ, అదానీ బంధంపై విచారణ జరపాలి: కేటీఆర్
‘అదానీతో సెబీ చీఫ్‌కు ఉన్న సంబంధం నిజంగా ఆందోళనకరం. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. ‘ఈ విషయంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశముంది. రాహుల్ గాంధీ గారూ.. తెలంగాణలో మీ సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతున్నారు. అదానీ పాట పాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సమగ్రతను కూడా గంగలో కలుపుతున్నాడు. ఈ ద్వంద్వ విధానాలపై మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా’ అని కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు.