రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Komatireddy Raj Gopal Reddy Slams Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌రెడ్డి చరిత్ర  ప్రజలకు తెలుసు.. పదవుల్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నావ్‌’

Published Sat, Apr 22 2023 7:55 PM | Last Updated on Sat, Apr 22 2023 8:01 PM

Komatireddy Raj Gopal Reddy Slams Revanth Reddy - Sakshi

హైదరాబాద్‌: టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి గత చరిత్ర ప్రజలందరికీ తెలుసని. పబ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్‌ మెయిలర్‌ అనే పేరుందని ఘాటుగా వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్‌ మెయిల్‌ చేసి వేల కోట్లు దోచుకున్నారని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.ఇప్పుడేమో  భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణాలు అంటే నమ్మెదెవరని నిలదీశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏమన్నారంటే..

►రేవంత్ గ‌త చ‌రిత్ర ప్ర‌జ‌లంద‌రికీ తెల్సిందే. ప‌బ్లిక్ లో రేవంత్ కు బ్లాక్ మెయిల‌ర్ అనే పేరుంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ..... ఇప్పుడు భాగ్య‌ల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్ర‌మాణాలంటే న‌మ్మేదెవ‌రు. 

 ►లెక్క‌లేన‌న్ని త‌ప్పుడు ప‌నులు చేస్తున్న రేవంత్  భాగ్య‌ల‌క్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాల‌యం అప‌విత్రం అవుతుంద‌నేది భ‌క్తుల భావ‌న‌. రాజ‌కీయ వ్య‌భిచారం చేసే వ్య‌క్తి రేవంత్, త‌న స్వార్ధం కోసం భాగ్య‌ల‌క్షి గుడిని కూడా వాడుకోవ‌డం భావ్యం కాదు.

►టిడిపి ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన రాజకీయ వ్యభిచారివి నువ్వు కాదా రేవంత్. ఈటెల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేయలేదు.

►కాంగ్రెస్ హైక‌మాండ్  పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవ‌డం ద్వారా రాజ‌కీయ వ్యభిచారానికి పాల్ప‌డింది నువ్వు కాదా రేవంత్.  

►కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్త‌వం కాదా, ఆమెతో నీకు వ్యాపార‌ భాగస్వామ్యం లేదా, 

►ఓటుకు నోటు కేసులో ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ల‌తో రెడ్ హాండెడ్ గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర రాజ‌కీయ వ్య‌భిచారం కాదా

►మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి 25 కోట్లు కాంగ్రెస్ కు ముట్టాయని, అయితే అందులో ప‌ది కోట్లు రేవంత్ నొక్కేసాడని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విష‌యం వాస్త‌వం కాదా.

►మునుగోడులో బిజెపి గెలిస్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌త‌న‌మ‌వుతుంద‌ని, అందుకే న‌న్ను ఓడించేందుకు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీని గెలిపించ‌డం రాజ‌కీయ వ్య‌భిచారం కాదా రేవంత్.

►న‌న్ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌, మునుగోడులో న‌న్ను ఓడించేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి, 18 వేల కోట్ల‌కు అమ్ముడు పోయానంటూ టిఆర్ ఎస్ తో క‌లిసి దుష్ప్ర‌చారం చేయ‌డం రాజ‌కీయ వ్యభిచారం కాదా రేవంత్ .

►పార‌ద‌ర్శకంగా జ‌రిగిన‌ గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ లో టెండర్ దక్కితే, ఆ వాస్త‌వాన్ని దాచి అమ్ముడు పోయానంటూ తప్పుడు ఆరోపణ చేసిన దగుల్బాజీ రేవంత్ , మ‌రి నీ దగ్గ‌ర ఆధారాలుంటే ఎందుకు రుజువు చేయ‌డం లేదు. 

►నాపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయ‌క‌పోతే రేవంత్ను వ‌దిలే ప్ర‌సక్తే లేదు. రాజ‌కీయంగా రేవంత్ ను వేటాడుతా, కోర్టు ద్వారా కూడా రేవంత్ సంగ‌తి తేలుస్తా. నేను దాఖలు చేయ‌నున్న ప‌రువు న‌ష్టం కేసులో ఎప్ప‌టికైనా రేవంత్  జైలుకు వెళ్ల‌డం ఖాయం.

►రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ కవితతో వ్యాపార సంబంధాలు ఉన్న మాట వాస్తవమా ? కాదా?

►బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం లో ప్రమాణం చేస్తే ఎవరు నమ్ముతారు ? 

►రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయంలో అడుగుపెడితే అపవిత్రం అవుతుందని భక్తులు భావిస్తున్నారు

► బీఆర్‌ఎస్‌ ఇచ్చిన 25 కోట్లలో రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు

►రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో దొరికింది నిజమా ? కాదా?

►కాంగ్రెస్ హై కమాండ్ కి డబ్బులు ఇచ్చి పిసిసి పదవి కొన్నవా ? లేదా ? 

►నేను, ఈటల ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరింది రేవంత్ రెడ్డి కాదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement