‘చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదు’ | Kakani Govardhan Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదు’

May 3 2026 12:32 PM | Updated on May 3 2026 12:35 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu

సాక్షి, నెల్లూరు: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ.. గుణపం పోటు పార్టీ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన వారిని మీ వెనుక వేసుకొని.. వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అనడం కాదన్నారు. చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదని కాకాణి ఎద్దేవా చేశారు.

గుణపం చంద్రబాబు చేతిలో పెడితే సింబాలిక్‌గా వుంటుంది. అమరావతిని గుణపంతో తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. దోపిడీ విజనరీతో అవినీతితో రాజ్యం ఏలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాలు పేరిట కాంట్రాక్టుల మాటున కొల్లగొడుతున్నారు’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement