
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చైనా 970 చ.కి.మీ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే మోదీ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. సర్జికల్ స్టైక్ చేయాలంటే చైనాపై చేయాలని, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘‘పాతబస్తీలో ఎంతమంది పాకిస్థానీయులు ఉన్నారో చెప్పండి? ఈ ప్రాంతంలో ఉన్నవారందరూ దేశభక్తులే. ఇక్కడ దేశద్రోహులెవరినీ మేమే ఉండనివ్వం. ఈ దేశంపై మీకు ఎంత హక్కు ఉందో.. మాకూ అంతే హక్కు ఉందని’’ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.(చదవండి: ఆమె ముస్లిం కాదు : ఒవైసీ)