రుణమాఫీ సరే.. వడ్డీ సంగతేంటి: హరీష్‌ రావు వ్యాఖ్యలు | Ex MLA Harish Rao New Demand Over Runa Mafi And Interest | Sakshi
Sakshi News home page

రుణమాఫీ సరే.. వడ్డీ సంగతేంటి: హరీష్‌ రావు వ్యాఖ్యలు

Jul 26 2024 10:40 AM | Updated on Jul 26 2024 10:40 AM

Ex MLA Harish Rao New Demand Over Runa Mafi And Interest

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడు నెలల కాలయాపన చేసిందన్నారు. దీంతో, రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.

కాగా, హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా.. డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పి, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు.

 

 

ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement