Huzurabad Bypoll: బజాజ్‌ చేతక్‌ స్కూటర్లంటే సెంటిమెంట్‌ ‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?

Etela Rajender Had 3 Bajaj Scooters: Not Appearing Anywhere Right Now - Sakshi

సాక్షి, కరీంనగర్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బజాజ్‌ చేతక్‌ స్కూటర్లంటే సెంటిమెంట్‌. తన వద్ద ఏకంగా మూడు స్కూటర్లు ఉండేవి. ఆ స్కూటర్ల నంబర్లు కూడా సీరియల్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఏపీ28 ఏఏ 4818, ఏపీ 28 ఏఏ 4819, ఏపీ 28 ఏఏ 4820 సీరియల్‌ నంబర్లుగా ఉండేవి. ఒకేసారి రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల ఇలా సీరియల్‌ నంబర్లు పొందగలిగారు. ఇంత ప్రేమతో, సీరియల్‌ నంబర్లతో కొనుగోలు చేసిన స్కూటర్లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో 3 స్కూటర్లు తన వద్ద ఉన్నాయని, వాటి విలువ రూ.20 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: హుజురాబాద్‌ ఉప ఎన్నిక: అన్నా.. ఎవరు గెల్తరంటవే?

కానీ, ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల అఫిడవిట్‌లో ఈటల పేరిట స్కూటర్, కారు ఇలా ఒక్క వాహనం కూడా లేదని చూపించారు. ఈటలకు సెంటిమెంట్‌గా ఉన్న స్కూటర్లు ఏమయ్యాయనే చర్చ జరుగుతోంది. పాతవి కావడం వల్ల స్క్రాప్‌నకు వేశారా.. లేదా తమ కార్యకర్తలకు ఎవరికైనా గిఫ్ట్‌గా తన సెంట్‌మెంట్‌ స్కూటర్లు ఇచ్చారా.. అనే ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లో రూ.16.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించిన ఈటల రాజేందర్‌ తన పేరిట ఒక్కæ వాహనం కూడా లేదని తెలుపడం గమనార్హం. 
చదవండి: హుజురాబాద్‌ ఉప ఎన్నిక: వెజ్‌ రూ.40.. నాన్‌వెజ్‌ రూ.100

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top