కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో జరుగుతుంది అభివృద్ధా?.. వినాశానమా? అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరగడం తప్ప దేశంలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో ప్రజలు క్రమశిక్షణ కోల్పోతున్నారని.. రోజు రోజుకీ సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. జీడీపీ కుంటుపడటంతో పాటు దేశ బ్యాంకింక్ వ్యవస్థ సమస్యల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందన్నారు. కేంద్రం నిర్ణయాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని రాహుల్ ఆరోపించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి