‘అప్పుడేం చెప్పావో మర్చిపోయావా?.. నటించొద్దు బాబూ’ | Cpi Ramakrishna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అప్పుడేం చెప్పావో మర్చిపోయావా?.. నటించొద్దు బాబూ’

Jan 29 2025 7:13 PM | Updated on Jan 29 2025 7:42 PM

Cpi Ramakrishna Comments On Chandrababu

చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు.. అధికారం వచ్చాక మరోలా మాట్లాడతాడంటూ సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు.. అధికారం వచ్చాక మరోలా మాట్లాడతాడంటూ సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం రూ.3 లక్షల కోట్లు కేంద్రం ఇస్తే రైతులకు సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజులు చెల్లించక విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు.. వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు.

‘‘వైఎస్‌ జగన్ ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పావ్.. ఇప్పుడు నువ్వేం చేస్తున్నాం.. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావ్.. అమరావతికి కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? కేవలం అప్పు మాత్రమే ఇచ్చారు.. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత సీఎం చంద్రబాబుదే..  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలన్నావ్‌.. ఆ మాట ఇప్పుడు ఏమైంది?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నలు గుప్పించారు.

‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చంద్రబాబు అన్నాడు. ఇప్పడు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు. దేశం తిరోగమనం వైపు వెళుతుంది.. మత ఛాందసం పెరిగిపోయింది. కుంభమేళాను గొప్పగా చెప్తున్నారు. ఒంటి నిండా బూడిద పూసుకొని పుర్రెలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా.? సీపీఐ పార్టీ వందేళ్ల ప్రయాణంలో కామ్రేడ్స్ త్యాగాలు మరువలేనివి. బ్రిటీష్ వారిపై పోరాడిన పార్టీ సీపీఐ. ఆర్ఎస్ఎస్ ఏనాడూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ నేడు స్వాతంత్రాన్ని అనుభవిస్తుంది. బీజేపీకి 400 స్థానాలు వచ్చి ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండేది కాదు’’ అంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తప్పుడు వార్తలు.. ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement