పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌..

Congress Leaders Kirti Azad and Ashok Tanwar To Join TMC  - Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలకనేతలు కీర్తి ఆజాద్‌, అశోక్‌ తన్వార్‌లు .. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువ కప్పుకున్నారు.  కాగా, అశోక్‌ తన్వార్‌ గతంలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా సేవలందించారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా, కీర్తి ఆజాద్‌.. 1983లో జరిగిన ప్రపంచకప్‌ క్రికెట్‌లో ఆజాద్‌ ఒక సభ్యుడు.

కీర్తి ఆజాద్‌ 2018లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కీర్తి ఆజాద్‌.. అరుణ్‌జైట్లీపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. కాగా, ఆజాద్‌ బిహార్‌లోని దర్భంగా నియోజక వర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే విధంగా..  మాజీ జెడీయూ నేత పవన్‌ వర్మా.. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top